Guntur: ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణ చేపట్టండి.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశం!

Guntur: గుంటూరు నగరంలో ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణ, ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక దృష్టి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలకు ఆదేశం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Sept 2026 9:53 AM IST
Guntur
X

Guntur: ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణ చేపట్టండి.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశం!

Guntur: గుంటూరు నగరంలో ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారని, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులకు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. నాలుగో వార్డులోని మణిపురం క్యాబిన్ రోడ్డులోని డ్రెయిన్లపై ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలు ఉండటంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలు రోగాలబారిన పడి విషయం ఎమ్మెల్యే నసీర్ దృష్టికి రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

యుద్ధప్రాతిపదిక ఆక్రమణలను తొలగింపజేశారు. డ్రెయిన్ ను సర్వే చేయాలని సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రధాన వాగుల్లో సిల్టేషన్ పక్కాగా జరగాలన్నారు. వర్షాలు అధికారంగా కురిస్తే ప్రకాష్ నగర్, రామిరెడ్డితోట, వినోభా నగర్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే సిల్టేషన్ కు అంచనాలు రూపొందించాలని మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

రానున్న రోజుల్లో ఎక్కడా మురుగు సమస్య తలెత్తడానికి వీలు లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో డ్రెయిన్ల గురించి పట్టించుకోకపోవడంతో కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని తెలిపారు. మణిపురం క్యాబిన్ రోడ్డులో వీధిలైట్లు, బల్బులు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN