Guntur: మంగళవారం హెచ్‌ఏఎం మౌలిక వసతుల పనుల ప్రారంభం!

Guntur: కుప్పం నుంచి సీఎం చేతుల మీదుగా హెచ్‌ఏఎం ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Sept 2026 6:22 PM IST
Guntur
X

Guntur: మంగళవారం హెచ్‌ఏఎం మౌలిక వసతుల పనుల ప్రారంభం!

Guntur: పట్టణ ప్రాంతాల్లోమౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లోమౌలిక సదుపాయాల పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ద్వారా మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమాన్నిమంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. వర్చువల్ మీటింగ్ జరిగే విజ్ఞాన మందిరం, పరిసరాలను సోమవారం కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ హెచ్ఏఎం ప్రాజెక్ట్ లను వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విజ్ఞాన మందిరంలో జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల అధికారులు పాల్గొంటారని తెలిపారు.

మొదటి దశలో, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు, పార్కులు, ఇతర సంబంధిత మౌళిక వసతులకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రారంభం చేసే కార్యక్రమానికి హాజరయ్యే వారికి అవసరమైన ఎల్ఈడీ బోర్డ్ లు, ఆడియో సిస్టం, త్రాగునీరు సిద్దం చేయాలన్నారు. ఎంట్రన్స్ ఆర్చిని సిద్దం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను, ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, పార్కింగ్ సమస్య రాకుండా చూడాలన్నారు.

పర్యటనలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయలాజిస్ట్ శేషయ్య, డిఈఈ హనీఫ్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN