Prathipadu: నియోజకవర్గంలో రూ. 10.6 కోట్లకు చేరిన సీఎంఆర్ఎఫ్ నిధులు!
Prathipadu: ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు రూ.39.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అందజేశారు.
Prathipadu: నియోజకవర్గంలో రూ. 10.6 కోట్లకు చేరిన సీఎంఆర్ఎఫ్ నిధులు!
ప్రత్తిపాడు: నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు, రూ.39.40 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను (CMRF) 42 మంది లబ్ధిదారులకు అందజేసిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు,ఆర్థికంగా వెనుకబడినవారు ఎదుర్కొనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, అకస్మాత్తు ప్రమాదాలకు వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధి.దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే ఘనత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది.
ఇప్పటివరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 30 పర్యాయాలుగా , రూ.10.6 కోట్ల విలువ గల సీఎం సహాయనిది చెక్కులను,1084 మందికి గానూ పంపిణీ చేయడం జరిగింది.ఈ ఒక్క రోజు రూ.24.99 లక్షల విలువగల ఎల్ఓసీ చెక్కులను 15 మందికి మరియు రూ.14.4 లక్షల విలువ గల రియంబర్స్మెంట్ చెక్కులను 27 మందికి అందించడం




