Bapatla: ఒత్తిడికి చెక్ పెట్టాలంటే యోగా చేయాల్సిందే.. పర్చూరులో కలెక్టర్ పిలుపు!
Bapatla: బాపట్ల జిల్లా పర్చూరులో ఘనంగా నిర్వహించిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమం. అందరితో కలిసి యోగాసనాలు వేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
Bapatla: ఒత్తిడికి చెక్ పెట్టాలంటే యోగా చేయాల్సిందే.. పర్చూరులో కలెక్టర్ పిలుపు!
బాపట్ల జిల్లా: పర్చూరు పట్టణంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపం ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని అందరితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. నేటి జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా దివ్య ఔషధంలా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్, లవన్న యోగాంధ్ర నోడల్ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్వై విజయమ్మ, డీసీహెచ్ఎస్ పద్మావతి, ఆర్డీవో, హరికుమార్, తహసీల్దార్ బ్రహయ్య మరియు జిల్లా అధికారులు మండల స్థాయి సిబ్బంది అపాల్గొన్నారు.
Next Story




