Guntur: ఆహార నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవు!

Guntur: గుంటూరు జిల్లాలో వసతి గృహాలు, అంగన్వాడీలు, పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యతలో రాజీ పడబోమని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 6:45 AM IST
Guntur
X

Guntur: ఆహార నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవు!

Guntur: మెనూ ప్రకారం వసతి గృహాలు, అంగన్వాడీ, పాఠశాల విద్యార్థులకు ఆహారం అందాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు.

గుడ్లు నాణ్యమైనవిగా ఉండాలని, పాడైన గుడ్లు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి సమాచారం అందించాలని అన్నారు. అన్నా క్యాంటీన్ లలో సైతం ఆహార పదార్థాల నాణ్యతలో రాజీపడరాదని అన్నారు. పురపాలక సంఘాల పరిధిలో పారిశుధ్యం నిర్వహణ, పూడికలు తీయడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త పింఛన్ల మంజూరు మాత్రమే కాకుండా, పింఛన్ల పంపిణీలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలు అందజేయాలని స్పష్టం చేశారు. విద్యా శాఖలో స్టార్ రేటింగ్ లను మెరుగు పరచాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులకు రూపొందించిన యాప్ లలో సమాచారాన్ని పొందుపరచాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జి.ప్రసూన, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్,

ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్. శ్రీనివాస మూర్తి, రహదారులు భవనాలు శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ సి.విశ్వనాథరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి.దుర్గాబాయి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె.పార్థసారథి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా తదితరులు పాల్గొన్నారు...

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN