Suryalanka: సూర్యలంక తీరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
Suryalanka: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
Suryalanka: సూర్యలంక తీరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
సూర్యలంక: సముద్రతీరంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, మరియు చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాల కొండయ్య గారు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ:
యోగాంధ్రవలన ఆరోగ్యం, ఆనందం ప్రతి మనిషికి దక్కాలని ఆయన అన్నారు. యోగాంధ్ర ను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకుంటున్నామని అన్నారు. యోగాంధ్ర ద్వారా యోగాను నేర్పించడం, ప్రతిరోజు చేయించడం, యోగాను రోజు చేయటం వలన మంచి ఆరోగ్యంతో మన దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటామని, తెలివిగా ఆలోచిస్తామని ఆయన అన్నారు.
యోగాను ప్రతిరోజు అలవర్చుకోవాలి, దానివల్ల ఆరోగ్యం, ఆనందమే కాకుండా కుటుంబానికి తద్వారా దేశానికి మేలు చేసే ఆలోచన ఉంటుందన్నారు. మనందరం బాగుండాలి కలిసి ఉండాలి అని అన్నారు. ఎన్నో మతాలు, కులాలు, దైవాలు,దైవత్వాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలిసి ఉన్న భారతమాత ముద్దుబిడ్డలం అని అన్నారు. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలని అన్నారు.
రాష్ట్రంలో మనలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఇంత ఘనంగా నిర్వహించడానికి కారుకులైన అధికారులను, యోగా గురువులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, చీరాల శాసనసభ్యులు ఎం.మాలకొండయ్య గారు శాలువా మరియు మెమొంటో లతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ.జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ హరి కుమార్, డి యం & హెచ్ ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, యోగాంద్ర జిల్లా నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డి ఎఫ్ ఓ.రవిశంకర్,ఆర్టీసీ ఆర్ యం .విమల, డిఆర్డీఏ,మెప్మా,ఐ సి డి ఎస్, గృహ నిర్మాణ సంస్థ పి డి లు బి.సింగయ్య, ఆనంద సత్యపాల్, రాధమాదవి, వెంకటేశ్వరరావు,డి ఈఓ.శ్రీనివాస్, డి పి ఓ.యల్ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ హాసిని, వివిధ శాఖల జిల్లా అధికారులుతదితరులు పాల్గొన్నారు.




