Guntur: సాయంత్రం 5 గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి!

Guntur: గుంటూరు ఏసీ కాలేజీలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన నగర కమిషనర్ కె.మయూర్ అశోక్. సాయంత్రం 5 గంటలలోపు ఉద్యోగులంతా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Oct 2026 1:23 PM IST
Guntur
X

Guntur: సాయంత్రం 5 గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి!

Guntur: ఎన్నికల విధులు కేటాయించబడి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగుల కోసం ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని బుధవారం నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ పరిశీలించారు.

పోలింగ్ కేంద్రం వద్ద రద్దీ ఏర్పడకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు . ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.

పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను పక్కాగా సీలింగ్ చేసి, స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచడంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఉద్యోగులు ఎవరైనా ఉంటే, ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5:00 గంటలలోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN