Vinukonda: కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ మెడికల్, పారామెడికల్ ఉద్యోగుల భారీ క్యాండిల్ ర్యాలీ. సంఘీభావం తెలిపిన APNGO.
Vinukonda: కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ!
Vinukonda: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ మెడికల్ & హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జేఏసీ –పల్నాడు , వినుకొండ టీం ఆధ్వర్యంలో వినుకొండలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి APNGOతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.కాంట్రాక్ట్ మెడికల్, పారామెడికల్ ఉద్యోగులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.
తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు JAC నాయకులు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో నిరంతరం సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ జీతం అమలు, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, పెయిడ్ మెడికల్ లీవ్స్, హెల్త్ కార్డుల మంజూరు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ సంఘీభావం, మద్దతు కొనసాగుతుందని APNGOతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో JAC స్టేట్ వైస్ చైర్మన్ పి. శివరామకృష్ణ, జిల్లా చైర్మన్ నాగరాజు కుమారి, శాంతా రాజు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర నాయక్, స్టేట్ కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.




