Vinukonda: వినుకొండలో డీజే శబ్ద కాలుష్యంపై సీపీఐ వినతి పత్రం!

Vinukonda: వినుకొండలో విచ్చలవిడిగా సాగుతున్న డీజే శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ నాయకులు పోలీసులకు వినతి పత్రం అందజేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 30 Sept 2026 6:58 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో డీజే శబ్ద కాలుష్యంపై సీపీఐ వినతి పత్రం!

Vinukonda: వినుకొండ పట్టణంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న డీజే శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ,వినుకొండ పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉలవలపూడి రాము మాట్లాడుతూ పట్టణంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.విద్యాసంస్థలు, ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో, అలాగే రాత్రి వేళల్లో అధిక శబ్దంతో డీజేలు నిర్వహించకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించే డీజే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,ప్రజలు రద్దీగా తిరిగే ప్రాంతాల్లో భారీ శబ్దాలు వచ్చే బాణాసంచా పేల్చడంపైనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాము విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చీరాల అంజయ్య, తోట నరసింహారావు, దుర్గా రెడ్డి, షేక్ ఇబ్రహీం, బిజ్జ్యం రమేష్ రెడ్డి, షేక్ హుస్సేన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA