Bollapalli: నీటి సమస్యలపై సీపీఐ సమరం.. జూలై 6న కలెక్టరేట్ ముట్టడి!

Bollapalli: బొల్లాపల్లి మండలంలోని గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 26 Jun 2026 7:42 PM IST
Bollapalli
X

Bollapalli: నీటి సమస్యలపై సీపీఐ సమరం.. జూలై 6న కలెక్టరేట్ ముట్టడి!

బొల్లాపల్లి: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని కండ్రికతో పాటు నాలుగు గ్రామాల్లో దాదాపు 4,500 మంది గత నాలుగు దశాబ్దాలుగా తీవ్ర తాగునీటి, సాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు.

నాగార్జునసాగర్ కాల్వ పక్కనే ప్రవహిస్తున్నా గ్రామాలకు తాగునీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యమని విమర్శించారు. 1,000–2,000 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు రావడం లేదని, నీటి కొరతతో ప్రజలు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా కాల్వ నుంచి పైప్‌లైన్ ద్వారా చెరువులకు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 6న నరసరావుపేట కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము తదితరులు ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story