Vinukonda: పల్నాడును వంచించిన కేబినెట్.. వరికపూడిశలకు నిధులేవి?
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Vinukonda: పల్నాడును వంచించిన కేబినెట్.. వరికపూడిశలకు నిధులేవి?
Vinukonda: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ పర్యటనకు వచ్చిన ఆయన పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 25 ప్రాజెక్టుల గురించి చర్చించిన కూటమి ప్రభుత్వం, పల్నాడు ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే వరికపూడిశల ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు.
కేవలం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 'అమరావతి, పోలవరం' జపమే చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు తాగు, సాగునీరు లేక కరువు సీమలుగా మారుతున్నాయని, రైతాంగానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.




