Tadikonda: తాడికొండలో దళితుల వరుస మరణాలపై సీపీఎం ధ్వజమెత్తు!
Tadikonda: తాడికొండలో దళితుల వరుస మరణాలపై సీపీఎం ఆగ్రహం. మృతుల కుటుంబాలకు ₹25 లక్షల పరిహారం, న్యాయ విచారణ డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా.
Tadikonda: తాడికొండలో దళితుల వరుస మరణాలపై సీపీఎం ధ్వజమెత్తు!
Tadikonda: తాడికొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ఇద్దరు దళితులు హత్యకు గురయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అధికార పార్టీ నేతల అహంకారం, పోలీసుల వేధింపులు కారణంగా ఈ మరణాలు సంభవించాయని చెప్పారు. బ్రాడేపేట సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు అమరావతి రాజధాని సమీపంలో అనాగరిక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా బాధిత కుటుంబాలను పరామర్శించక పోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించి, ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇరువురు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కూటమి పరిపాలనలో దళిత వాడల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ప్రశ్నించే వారిని అణచి వేయాలని చూడడం, బెదిరించి పరిపాలన చేయాలనే ఆలోచన సీఎం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో సీపీఎం నాయకులు సీ.హెచ్ బాబూరావు , నేతాజీ, మాల్యాద్రి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.




