Chirala: పేదలపై నిత్యావసరాల ధరల భారం తగ్గించాలి!
Chirala: చీరాలలో దళిత బహుజన పార్టీ డిమాండ్ పేదలపై ధరల భారం తగ్గించాలి నిత్యావసర సరుకుల నియంత్రణ, పీడీఎస్ బియ్యం పంపిణీపై తహసీల్దార్‌కు షేక్ జిలానీ వినతిపత్రం.
Chirala: పేదలపై నిత్యావసరాల ధరల భారం తగ్గించాలి!
చీరాల, సెప్టెంబర్ 28 : చీరాల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలానీ నాయకత్వంలో పార్టీ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా షేక్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు సబ్సిడీ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు నాణ్యమైన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సక్రమంగా అందించాలని కోరారు. అలాగే అక్రమంగా సరుకులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




