Ponnuru: పొన్నూరులో దారుణం డబ్బు కోసం కన్నతల్లిని చంపిన కూతురు!
Ponnuru: పొన్నూరులో డబ్బు, నగల కోసం కన్నతల్లి లక్ష్మిని గొంతు నులిమి హత్య చేసిన కూతురు, అల్లుడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Ponnuru: పొన్నూరులో దారుణం డబ్బు కోసం కన్నతల్లిని చంపిన కూతురు!
Ponnuru: ఈనెల 12వ తేదీన పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈపూరి లక్ష్మి (45) అనే మహిళ హత్యకు గురైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తల్లి ఒంటిపై ఉన్న నగలు ఆమె వద్ద ఉన్న డబ్బుల కోసం కూతురే హంతకురాలిగా మారడం పట్టణంలో సంచలనం కలిగించింది. పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈపూరి లక్ష్మి (45) పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఆయాగా విధులు నిర్వహిస్తుంది
మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్త కుమారుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.
కుమారుడు మృతితో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులను తల్లి లక్ష్మి బంగారు నగలు తాకట్టు నుండి విడిపించింది. కుమార్తె పుష్పలత కు మృతురాలు లక్ష్మి వివాహం చేయడంతో వారికి ఒక బాబు పుట్టిన అనంతరం భర్తను వదిలి బాబును తల్లి దగ్గర ఉంచి ఇంట్లో నుండి వెళ్లిపోయింది.
వైజాగ్ లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తల్లి వద్దకు వచ్చి కూలి పనులు చేసుకునేందుకు వెళ్తుంది.
ఇంస్టాగ్రామ్ లో నిందితుడు రాకేష్ కుమార్ ఎలియాస్ రాజు పరిచయం అవ్వడంతో ఇరువురు తిరుపతిలో వివాహం చేసుకున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో తల్లిని పలుమార్లు డబ్బులు అడిగిన ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెంది ఈనెల 12వ తేదీన పథకం ప్రకారం గొంతు నులిమి తల్లిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదుతో ఊడయించింది. పొన్నూరు అర్బన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరచనున్నారు.




