Guntur: దళితులపై పోలీసుల అత్యాచారాలు ఆగాలి.. గుంటూరులో నేతల గర్జన!

Guntur: రాజ్యాంగ నైతికతను దెబ్బతీయడం వల్లే దళితులపై పోలీసు అత్యాచారాలు పెరుగుతున్నాయని గుంటూరు డీబీఎఫ్ సదస్సులో వక్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Sept 2026 9:28 PM IST
Guntur
X

Guntur: దళితులపై పోలీసుల అత్యాచారాలు ఆగాలి.. గుంటూరులో నేతల గర్జన!

Guntur: ప్రజా ప్రతి తినిధులు, రాజకీయ నాయకులు రాజ్యాంగ నైతికతను దెబ్బతీయటం మూలంగానే పోలీసు అత్యాచారాలు పెరిగి పోయాయాని దళిత నాయకులు పేర్కొన్నారు.

గురువారం గుంటూరు లో పెన్షనర్స్ హాల్ లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన చుండూరు పల్లె వీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 35 వర్ధంతి సభలో పోలీసు అత్యాచారాలు పై సభలో నేతలు ప్రస0గించారు.

సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదు పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర0 విడిపోయిన తరువాత పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకత్వాన్ని నియత్రిస్తూ చట్టాలను అతిక్రమించడం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ వ్యవస్థల అసమర్థత కారణం గా, దళితులు, అనగారిన వర్గాల పై పోలీసు అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ MLC KS లక్ష్మణ రావు సభ లో మాట్లాడుతూ ప్రభుత్వ అధికార యంత్రాగాన్ని ప్రజాస్వామీకరించాలని, చట్టాలను, న్యాయన్ని కాపాడుకోవడానికి ప్రజా ఉద్యమ నాయకత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ నాయకత్వం దళితులకు అండగా నిలవటం లేదని ఆయన వివరించారు.

దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్తాపక అధ్యక్షులు కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ మనువాద వ్యవస్థలనుంచి ప్రభుత్వ సంస్థలను కాపాడాలని వివరించారు. దళితుల పై పోలీసు దాడులు, హత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దళితుల ను వేధింపుల కు గురిచేసే పోలీసు అధికారుల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సభకు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్య రావు అధ్యక్షత వహించారు.

ఈ సభలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు అంగడాల పూర్ణ చంద్ర రావు, AP బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయ వాదులు G. శాంత కుమార్, R. గంగా భవాని, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధిర నాగేశ్వర రావు, VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు NJ. విద్యా సాగర్, BC సంఘాల రాష్ట్ర నాయకులు ఉగ్గం సాంబాశివరావు, D. వెంకటేశ్వర రావు, చుండూరు బాధిత పోరాట కమిటీ అధ్యక్షులు జాలాది మోజెష్, కారంచేడు పోరాట కమిటీ కార్యదర్శి సిర్రా భగత్ సింగ్, AP MRPS రాష్ట్ర అధ్యక్షలు పేరు పోగు వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర, GVR కోచింగ్ సెంటర్ కన్వీనర్ తురకా వీరయ్య, DBF నాయకులు భూపతి సునీల్ కుమార్, పల్లె జ్యోతి, సాతులూరి రామాంజనేయులు, దారా బాబురావు, పాటిబండ్ల కోటేశ్వర రావు, మన్నం రాజ శేఖర్ తదితరులు పాల్గొని ప్రస0గించారు.

సభలో వందమంది దళిత నాయకులకు దళిత వీర్ అవార్డులు ప్రధానం చేశారు. సభలో తొలుత చుండూరు పల్లె వీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ చిత్ర పటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story