Bapatla: బాపట్లలో ఆలస్యంగా ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు!
Bapatla: బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆలస్యంగా ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు. కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రత్యేక అధికారిణి పద్మావతి.
Bapatla: బాపట్లలో ఆలస్యంగా ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు!
Bapatla: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గంలో సమయం 9:00 అవుతున్న గాని ఇప్పటికీ జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించకపోవడంతో రాజకీయ పార్టీ నాయకులు అసహన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బాపట్ల పట్టణంలోని బాపట్ల, కర్లపాలెం,పివి పాలెం, మండలాలకు సంబంధించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కేంద్రానికి బాపట్ల జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారిని పద్మావతి ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారి వచ్చేసరికి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ రూమ్ లోకి తీసుకొచ్చి లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు. ఏదేమైనా అన్ని నియోజకవర్గాలలో బాపట్ల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో వెనకంజలో ఉందని చెప్పొచ్చు.




