Ponnur: నిడుబ్రోలు ప్రభుత్వ ఆస్పత్రిలో ధూళిపాళ్ల దళం సేవా కార్యక్రమాలు!

Ponnur: పొన్నూరు నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ధూళిపాళ్ల దళం ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి క్యాన్ల పంపిణీ. దళితుల ఐక్యత, సేవే ధ్యేయమని కన్వీనర్ జ్ఞాన సుందర్ రావు వెల్లడి.

SHAREEF, PONNURU
Published on: 14 Sept 2026 7:57 PM IST
Ponnur
X

Ponnur: నిడుబ్రోలు ప్రభుత్వ ఆస్పత్రిలో ధూళిపాళ్ల దళం సేవా కార్యక్రమాలు!

Ponnur: దళితుల ఐక్యతను చాటుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న దృక్పథంతో ధూళిపాళ్ల దళం ఏర్పాటయిందని కన్వీనర్ నీల జ్ఞాన సుందర్ రావు తెలిపారు.

ధూళిపాళ్ల దళం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచినీటి సరఫరాకు సంబంధించి వాటర్ క్యాన్లను ఆస్పత్రి ఇంచార్జ్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్, అభివృద్ధి కమిటీ మెంబర్ చెన్నుపాటి భాస్కర్లకు అందజేశారు. ధూళిపాళ్ల దళాన్ని మరింత బలోపేతం చేసి సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అరె ప్రసాద్, తమనం రవి, ఎద్దు సోంబాబు, కొచ్చర చంటి, గర్నెపూడి అనిల్, న్యాయవాది లక్ష్మీకాంత్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU