Guntur: ఫొటోల కోసం ప్రజలను మభ్యపెట్టొద్దు: ఎమ్మెల్యే నసీర్
Guntur: గుంటూరు తూర్పులో రూ.3.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Guntur: ఫొటోల కోసం ప్రజలను మభ్యపెట్టొద్దు: ఎమ్మెల్యే నసీర్
Guntur: అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం. ఫొటోలకు ఫోజుల కోసం ప్రజలను మభ్యపెట్టకండి. స్ట్రోమ్ డ్రెయిన్, పీకలవాగుకు తేడా తెలియని వాళ్లా మాట్లాడేది ?. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే చెప్పండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు.
శుక్రవారం స్థానిక ఇజ్రాయిల్ పేట, బసవతారక రామ నగర్, బారాయిమామ్ పంజా, లాలాజాన్ బాషా పార్కు రోడ్డు ప్రాంతాల్లో రూ.3.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకుపైగా ఈ ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా నిర్మించిన దాఖలాలు లేవని తెలిపారు. పేద, మధ్య తరగతి నివసించే ఈ ప్రాంతాల్లో వీధులు ఇరుకుగా ఉండటంతో రోడ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. ఆరు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదని, ప్రస్తుతం వచ్చిన కాంట్రాక్టర్ ను ఒప్పించి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు.
నియోజకవర్గంలో పీకలవాగు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళుతుందో కూడా తెలియకుండా ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, ప్రజలను గందరగోళానికి దారితీసే అంశాలు తీసుకొస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా రూ.350 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వంద కోట్లతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేశామని అన్నారు.




