Guntur: గుంటూరు నూతన డీఎంహెచ్‌వోగా డాక్టర్ ఎం. పద్మావతి బాధ్యతల స్వీకరణ!

Guntur: గుంటూరు జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణిగా డాక్టర్ ఎం. పద్మావతి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Oct 2026 5:44 PM IST
Guntur
X

Guntur: గుంటూరు నూతన డీఎంహెచ్‌వోగా డాక్టర్ ఎం. పద్మావతి బాధ్యతల స్వీకరణ!

Guntur: గుంటూరు జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణిగా డాక్టర్ యం. పద్మావతి, సివిల్ సర్జన్, ప్రభుత్వ జ్వరముల వైద్యశాల, గుంటూరు, గురువారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ యం. పద్మావతి మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల ద్వారా అందుతున్న సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ప్రతి స్థాయిలో విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ వంతు కృషి చేయాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణ, టీకా కార్యక్రమాలు, అంటువ్యాధుల నియంత్రణ, అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు మరియు నియంత్రణ, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అలాగే జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డాక్టర్ యం. పద్మావతి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర ఆరోగ్య సంస్థల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడంలో సమిష్టి కృషి అవసరమన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సమిష్టి కృషి

జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

బాధ్యతల స్వీకరణ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని ప్రోగ్రామ్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ యం. పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు మరియు చేపడుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై అధికారులు ఆమెకు వివరించారు.

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు అధికారులందరి సహకారంతో సమన్వయపూర్వకంగా ముందుకు సాగుతామని డాక్టర్ యం. పద్మావతి తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN