Guntur: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి!

Guntur: కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని అధికారులకు ERO ఖాజావలి ఆదేశం. దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 8:33 AM IST
Guntur
X

Guntur: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి!

Guntur: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ERO, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి సంబంధిత అధికారులనుఆదేశించారు.

కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ నుంచి కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం లోని అన్ని జిల్లాల AEROలు , మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు), జిల్లా విద్యా శాఖాధి కారులు , RIO లు, RJD ల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించడం జరుగుతుందని, అందువల్ల అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటర్ల నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించబడినందున, గడువులోగా అర్హులైన ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

2021లో గత ఎన్నికల సమయంలో కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధి లో 13505 మంది ఓటర్లుగా నమోదు కాగా, ఈసారి ఇప్పటివరకు కేవలం 8,414 దరఖాస్తులు మాత్రమే అందాయని, నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నవంబర్ 6 చివరి తేదీ కావడంతో, గడువులోగా దరఖాస్తు చేసుకోని వారికి ఈ ప్రక్రియలో మళ్లీ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన అర్హతలపై ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించాలని, మండలాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారందరికీ సమాచారం చేరవేసి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు సూచించారు.

సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించేలా అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి ధ్రువీకరణ చేపడతారని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో ఆఫ్‌లైన్ దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు.

అర్హతలకు సంబంధించి ఉపాధ్యాయులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేటు కాలేజీలలో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

అన్ని జిల్లాల AEROలు వారి పరిధి లోని అన్ని హై స్కూల్స్ , ప్రభుత్వ కాలేజీలు , ప్రైవేటు కాలేజీల వారిని సమన్వయం చేసుకుని నిర్దేశించిన గడువులోగా అర్హులైన ఉపాధ్యాయులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించేలా దాఖలు పరచేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరి యున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN