Vinukonda: నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో SIR 2026 లో భాగంగా 30 నూతన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఆమోదించింది.

KAREEMULLA, VINUKONDA
Published on: 30 July 2026 11:02 PM IST
Vinukonda
X

Vinukonda: నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి

వినుకొండ: వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల నమోదు అధికారి నారదముని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026లో భాగంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా 99–వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గతంలో 299 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఓటర్ల సౌకర్యం, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా 30 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందన్నారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 329కు చేరిందని వెల్లడించారు.

అదేవిధంగా, ఇప్పటికే ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఒక కేంద్రం ప్రదేశాన్ని మార్చేందుకు, మరో మూడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన చిరునామా, కేంద్రాల పేర్లలో ఉన్న తప్పులను సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు ఎన్నికల నమోదు అధికారి పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా చేపట్టిన ఈ మార్పులు ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసే విధంగా రూపొందించినట్లు తెలిపారు. సంబంధిత మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల వివరాలను ఓటర్లు గమనించాలని ఎన్నికల నమోదు అధికారి సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story