Bollapalli: బొల్లాపల్లి మండలంలో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు!
Bollapalli: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో రైతు నాగిరెడ్డి ఆత్మహత్య.
Bollapalli: బొల్లాపల్లి మండలంలో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగిరెడ్డి అనే రైతు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి ముందు రికార్డు చేసిన వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అప్పు పూర్తిగా చెల్లించినప్పటికీ ప్రకాశరావు అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని, పొలం పత్రాలు తన వద్ద ఉంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు.
అలాగే స్వామి అనే వ్యక్తికి ఆర్థిక సాయం చేసినప్పటికీ ఆ డబ్బు తిరిగి రాలేదని వాపోయాడు. తన మరణానంతరం ఆ డబ్బును తన భార్యకు అందజేయాలని వీడియో ద్వారా కోరాడు. నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోను ఆధారంగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.




