Guntur: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గాలిగోపుర పందిరి దగ్ధం!
Guntur: మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి గాలి గోపుర ముఖ ద్వార పందిరి బాణాసంచా నిప్పు రవ్వలు పడి దగ్ధం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో తప్పిన ప్రమాదం
Guntur: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గాలిగోపుర పందిరి దగ్ధం!
Guntur: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గాలిగోపుర ముఖ ద్వార పందిరి దగ్ధం! బాణాసంచా నిప్పురవ్వల పడటమే కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గాలి గోపుర ముఖ ద్వారానికి అనుసంధానంగా ఉన్న పందిరి సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది.
వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దేవస్థానం ఎదుట బాణాసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు పందిరిపై పడినట్లు దీని వలన ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.




