Guntur: పేదల ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే నసీర్
Guntur: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే నసీర్.. పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
Guntur: పేదల ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే నసీర్
Guntur: ప్రజలకు అన్ని వ్యవస్థలు జవాబుదారీగా ఉండాలని, ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శనివారం స్థానిక తూర్పు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే నసీర్ స్వయంగా స్వీకరించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, మురుగు నీటి సమస్య, విద్యుత్ స్థంభాల ఏర్పాటు వంటి వాటిపై ప్రజలు అర్జీలు అందజేశారు. ఆయా సమస్యలపై వెంటనే ఎమ్మెల్యే నసీర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఆయా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశామని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
త్వరలో నూతన పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోందని చెప్పారు. ఇప్పటికే స్పౌజ్ కేటగిరీ కింద భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే వెంటనే భాగస్వామికి అందించామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెల వ్యవస్థను తీసుకొచ్చిందని, మండల, జిల్లా స్థాయిలోనూ పీజీఆర్ఎస్ నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలకు సంతృప్తికరస్థాయిలో అధికారులు సేవలందించాలని సూచించారు.




