Prathipadu: వైఎస్సార్‌సీపీ నేత యేసుబాబును పరామర్శించిన సుచరిత
Prathipadu: ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ సీనియర్ నేత యేసుబాబును మాజీ మంత్రి సుచరిత పరామర్శించారు.
Prathipadu: వైఎస్సార్‌సీపీ నేత యేసుబాబును పరామర్శించిన సుచరిత
గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు మండలం, తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో మాజీ మండల యస్.సి.సెల్ అధ్యక్షులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ యేసుబాబు గారికి గత కొద్దిరోజుల క్రితం ఇనుప ర్యాక్ తగిలి కాలు నరం కట్ అవుటవలన హాస్పిటల్ నందు సర్జరీ చేయించుకొని డిస్చార్జీ అయ్యారు అని తెలుసుకొని ఈ రోజు వారి గృహంను శ్రీమతి మేకతోటి సుచరిత గారు, మాజీ హోం శాఖామాత్యులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వారు సందర్శించి యేసుబాబు గారిని పరామర్శించి, యోగ క్షేమములు అడిగి తెలుసుకొన్నారు. శ్రీమతి సుచరిత గారు, యేసుబాబు గారిని త్వరగా తిరిగి కోలుకొని జగనన్న పిలుపు మేరకు రాబోవు స్థానికి సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యరుల గెలుపు కోసం కృషి చెయ్యాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండలం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, మాజీ ఎం.పి.టి.సి.లు, మాజీ సర్పంచులు, వివిధ అనుబంద విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




