Palnadu: ప్రశ్నిస్తే కేసులు నిరసిస్తే అరెస్టులు బొల్లా బ్రహ్మనాయుడు!
Palnadu: ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వం పాలన తీరు అని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా విమర్శించారు.
Palnadu: ప్రశ్నిస్తే కేసులు నిరసిస్తే అరెస్టులు బొల్లా బ్రహ్మనాయుడు!
Palnadu: వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రైతులు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
మెగా డీఎస్సీపై నిరుద్యోగులు శాంతియుతంగా నిరాహార దీక్షలు చేపట్టాలనుకుంటే, పోలీసులు టెంట్లు, మైకులు, బల్లలను సైతం స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాల వల్ల నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అన్నారు.వ్యవసాయ రంగంపై స్పందిస్తూ, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ మాగాణి సాగుకు అనుమతించకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
వరి, పొగాకు, మక్కజొన్న రైతులకు సరైన మద్దతు లేక ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని, పామ్ ఆయిల్ సాగు పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.గుంటూరు-1 మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై నమోదు చేసిన కేసులను కూడా ఆయన ఖండించారు.
బకాయిల కోసం పోలీసులను ఆశ్రయించిన వ్యక్తిపైనే కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, అక్రమ నిర్బంధాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు.




