Martur: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన మార్టూరు మాజీ అధ్యక్షుడు!
Martur: బాపట్ల జిల్లా మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావుతో పాటు 23 కుటుంబాలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరాయి.
Martur: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన మార్టూరు మాజీ అధ్యక్షుడు!
Martur: మార్టూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్టూరు టౌన్ మాజీ వైసీపీ అధ్యక్షుడు, మాజీ గ్రామ ఉపసర్పంచ్ కాకోలు రామారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 22 కుటుంబాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ కాకోలు రామారావు ప్రజా జీవితంలో నిజాయితీగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామారావు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాకోలు రామారావుతో పాటు మువ్వ కృష్ణయ్య, మువ్వ నాగేశ్వరరావు, పాపిశెట్టి రవి, కొనకంచి హనుమంతరావు, ఉప్పుటూరి జానకిరామ్, కాకోలు పుల్లారావు, కాకోలు వెంకటరావు, కాకోలు నాగరాజు, కాకోలు అభిలాష్, కాకోలు శ్రీనివాసరావు, పులుగు బానురెడ్డి, ములగాని నవీన్ రెడ్డి, దాసరి రమణ, కాకోలు వెంకటేశ్వరరావు, చింతలపూడి సుబ్బారావు, మక్కెన నాగబాబు, మన్నెం రామారావు, గడ్డం కరీముల్లా, నాగేంద్ర, బుడంగుంట్ల కళ్యాణ్, గుంటూరు గోపి, మర్రి గోపి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
మార్టూరు పట్టణంలో ఒకేసారి 23 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.




