Chittoor: శ్రీవారి పాదయాత్ర భక్తులకు చిత్తూరులో ఉచిత వసతి, అన్నదానం!
Chittoor: చిత్తూరు కట్టమంచి శాంతా రఘురాం కళ్యాణమండపంలో శ్రీవారి పాదయాత్ర భక్తులకు ఉచిత విశ్రాంతి, స్నాన సౌకర్యాలు, అన్నదాన ఏర్పాట్లు.
Chittoor: శ్రీవారి పాదయాత్ర భక్తులకు చిత్తూరులో ఉచిత వసతి, అన్నదానం!
Chittoor: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిత్తూరు నగరం కట్టమంచిలోని శాంతా రఘురాం కళ్యాణమండపం నందుఓం నమో వెంకటేశాయ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకువిశ్రాంతి తీసుకోవడానికి అలాగే స్నానం చేయడానికి సౌకర్యం ఏర్పాటు చేశారు.
మూడు పూటలా అన్నదానం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాట్లను చేశారు.ఈ అవకాశాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి నడిచి వచ్చే శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అన్నదాన కార్యక్రమాలు లో దాతలు భాగస్వామి కావాలని కోరుతూ అన్నదాన ట్రస్ట్ అకౌంట్ నెంబర్ సైతం మరియు స్కానర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు దాతలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.




