Vinukonda: వినుకొండలో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు

Vinukonda: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన వినుకొండలో ఉచిత రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంప్. 52 పెంపుడు జంతువులకు టీకాలు. పశుసంవర్ధక శాఖ ఏడీ శ్రీరాములు పిలుపు.

KAREEMULLA, VINUKONDA
Published on: 7 July 2026 7:27 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు

వినుకొండ: నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ ఏరియా పశువైద్యశాలలో అవగాహన సదస్సుతో పాటు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించినట్లు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నేలవల్లి శ్రీరాములు తెలిపారు.

ఈ సందర్భంగా పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించారు.రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు కుక్కలు, పిల్లులు మూడు నెలల వయసులోనే మొదటి యాంటీ రేబిస్ (ARV) టీకా వేయించాలని, అనంతరం ప్రతి సంవత్సరం బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

వినుకొండ ఏరియా పశువైద్యశాలలో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, పెంపుడు జంతువుల యజమానులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ శిబిరంలో వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన 52 పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story