Cherukupalli: చెరుకుపల్లి: రూ.1,08,216 పలికిన పద్మశాలి యూత్ వినాయక లడ్డూ
Cherukupalli: చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో పద్మశాలి యూత్ వినాయక లడ్డూ వేలం పాటలో 21 కేజీల మొదటి లడ్డూ రూ. 1,08,216 పలికింది.
Cherukupalli: చెరుకుపల్లి: రూ.1,08,216 పలికిన పద్మశాలి యూత్ వినాయక లడ్డూ
చెరుకుపల్లి: గుళ్లపల్లి గ్రామంలో 'పద్మశాలి యూత్' ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి లడ్డూ వేలం పాట ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. 21 కేజీల మొదటి లడ్డూను వంగరు విజయ్ కుమార్ (విజయ్ కుమార్ జ్యువెలరీస్) రూ. 1,08,216/- దక్కించుకున్నారు.5 కేజీల రెండవ లడ్డూను వంగరు వెంకట లక్ష్మణ రావు రూ. 26,500/- పాడుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
స్వామివారి లడ్డూను దక్కించుకున్న భక్తులకు పద్మశాలి యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును తదుపరి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పద్మశాలి యూత్ కమిటీ అధ్యక్షుడు పట్టెం భాను తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వంగరు నాగార్జున, సెక్రటరీ వంగరు షణ్ముఖ సాయి, క్యాషియర్ పడితపు చరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




