Chirala: ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: కాంగ్రెస్ ప్రెసిడెంట్!
Chirala: చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్ సమీక్ష జరిగింది. ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి లొంగిపోయాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
Chirala: ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: కాంగ్రెస్ ప్రెసిడెంట్!
Chirala: అధికార బీజేపీకి ఏపీలో స్వతంత్రగా పరిపాలించే పరిస్థితి లేకపోయినప్పటికీ రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి,రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్ ఆరోపించారు.సంస్థాగత నిర్మాణం పై కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో చీరాలలోని ఎన్ .వి .ఎస్ & ఎస్ .జే .ఆర్ కల్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో జరిగింది .
సమావేశానికి ముఖ్య అతిదిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి,రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్,రాష్ట్ర ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి హాజరయ్యారు.ఈసందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి,రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ పరిస్థితి "బి" ఫార్ బాబు,"J " ఫార్ జగన్, "P " ఫార్ పవన్ కళ్యాణ్ గా మారిపోయిందన్నారు.
తద్వారా ఏపీలో ఆయా ప్రాంతీయ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ భావజాలాలు ప్రజలపై రుద్దతున్నాయన్నారు.దేశంలో ప్రజల పక్షాన,ప్రజా సమస్యల ఫై బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏదైనా వుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనేనన్నారు.మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేలా నిర్మా ణాత్మకమైన ఆలోచనాధోరణితో ముందుకు సాగాలన్నారు.కాంగ్రెస్ పార్టీలో కష్టబడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఎపుడు ఉంటుందన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల ఫై కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలవాలన్నారు.తద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపితం సాధ్యమన్నారు. 2029 ఎన్నికలలో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తద్వారా రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకొనినందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు .దేశ అభ్యున్నతితో పాటుగా అని వర్గాల ప్రజల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరుసగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న సోషల్ మీడియా వార్తలను అయన తీవ్రంగా ఖండించారు.తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనని,కాంగ్రెస్ లోనే తాను జడ్పీటీసీ గా ఎంపీపీ గా ఎమ్మెల్యే గా పని చేశాన్నారు.ఇకపైన సైతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్వష్టం చేశారు.
ఇక జిల్లాలో పార్టీ బలోపితానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. అనంతరం జిల్లాలోని నియెజకవర్గాల వారీగా కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సాగింది.సమావేశానికి ముందుగా దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చీరాల గడియారస్తంభం కూడలిలోని కేక్ ను కట్ చేశారు ,,స్థానిక వై ఎస్ ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు.




