Vinukonda: గత ఐదేళ్ల వినుకొండ భూ దందాలపై విచారణ జరపాలి మల్లికార్జునరావు

Vinukonda: భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించాలని జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 30 Jun 2026 11:22 AM IST
Vinukonda
X

Vinukonda: గత ఐదేళ్ల వినుకొండ భూ దందాలపై విచారణ జరపాలి మల్లికార్జునరావు

వినుకొండ: గత ఐదేళ్లలో వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అన్ని భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలకు స్పందిస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వినుకొండ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 309/3లోని నాలుగు ఎకరాల భూమికి డీటీసీపీ అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన, గతంలో అసైన్డ్ భూములను అధికార బలంతో తక్కువ ధరకే కొనుగోలు చేసి, ప్రస్తుతం లే–అవుట్లుగా విక్రయిస్తున్నారని ఆరోపించారు.

అలాగే బొల్లా కన్వెన్షన్ నిర్మాణంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ఈ వ్యవహారాలపై త్రిసభ్య లేదా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

తనకు వెంకుపాలెంలో ఉన్న 13 ఎకరాల భూమికి అన్ని డీటీసీపీ అనుమతులు ఉన్నాయని అధికారిక పత్రాలతో వెల్లడించారు. సొసైటీలు, చెరువులు, చేప పిల్లల పంపిణీ, ఎంపీ నిధుల వినియోగంపై బొల్లా చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, నూజెండ్ల వెంచర్ అనుమతులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు.

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మక్కెన మల్లికార్జునరావు సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story