Guntur: గుంటూరులో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి.. కమిషనర్ ఆదేశాలు!
Guntur: గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
Guntur: గుంటూరులో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి.. కమిషనర్ ఆదేశాలు!
Guntur: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అభివృద్ది పనుల పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో రోడ్ల విస్తరణ పూర్తైన బృందావన్ గార్డెన్స్ రోడ్డు నిర్మాణ పనులు నిర్దేశిత ప్లాన్ ప్రకారం జరగాలన్నారు. అలాగే రోడ్డు కారిడార్ అభివృద్దిలో భాగంగా గుర్తించిన రోడ్ల అభివృద్ది పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత జంక్షన్లలో ఏపియుఐఎయంయల్, జియంసి పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా ట్రాఫిక్ స్టడీ చేయాలన్నారు. తదుపరి సమావేశం నాటికి యాక్షన్ రిపోర్ట్ అధించాలని ఆదేశించారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, జియంసి యస్.ఈ సుందర్రామి రెడ్డి, ఈ.ఈ విష్ణువర్ధన్, డి.ఈ.ఈ వెంకట రమణ, ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




