Guntur: జాతీయ, అంతర్జాతీయ రికార్డులు: కమిషనర్ మయూర్ అశోక్‌కు సత్కారం!
Guntur: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినందుకు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్‌ను వివిధ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు.
Guntur: జాతీయ, అంతర్జాతీయ రికార్డులు: కమిషనర్ మయూర్ అశోక్‌కు సత్కారం!
గుంటూరు: గుంటూరు నగర కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన కమిషనర్ మయూర్ అశోక్ కి సత్కారం వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన “స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026” లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం.
అలాగే పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏకకాలంలో 25 వేల మంది విద్యార్థులచే 25 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి, ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ లో గుంటూరు నగరం పేరు నమోదు అయ్యేలా కృషి చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ని మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో పలు స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు పి.శివప్రసాద్, మానవత స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ వి.వెంకట నాగిరెడ్డి, ది మునిసిపల్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ.మధుబాబు, మరాఠా రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్లు కమిషనర్ ని కలిసి, పర్యావరణ హితంగా పూల మొక్కలు అందజేసి, శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు.
గుంటూరు నగరాన్ని స్వచ్ఛ, సుందర నగరంగా తీర్చిదిద్దడంలో కమిషనర్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, చూపుతున్న చొరవ అభినందనీయమని, రాబోయే రోజుల్లో గుంటూరును మరిన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని వివిధ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో స్వచ్చ వాయు సర్వేక్షణ్ అవార్డ్, గ్రీన్ గణేష్ తో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధనలో సిబ్బంది, అధికారుల కృషితో పాటు ప్రజా ప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యం కీలమన్నారు. రానున్న కాలంలో గుంటూరు నగరపాలక సంస్థ చేసే కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములు కావాలని కోరారు.




