Guntur: గుంటూరులో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో కమిషనర్ సమావేశం!

Guntur: గుంటూరులో స్థానిక ఎన్నికల నిర్వహణకు పార్టీలు సహకరించాలని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ కోరారు; కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Oct 2026 10:40 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో కమిషనర్ సమావేశం!

Guntur: నగరంలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా జరిగేలా అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె. మయూర్ అశోక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.

లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు నగరంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణ పై చర్చించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఎన్నికల కోడ్ కూడా అమలులో వచ్చిందన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కోసం 16 బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ 8 బృందాలను, స్టాటిక్ సర్వ్లెన్స్ 8 బృందాలను ఏర్పాటు చేశామని, ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ అధికారిగా స్వర్ణ వార్డు అదనపు కమిషనర్ జి. రవీంద్ర బాబు నియమించామన్నారు.

ఫ్లైయింగ్ స్క్వాడ్ నగరంలో పర్యటిస్తూ అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలను సీజ్ చేయడం, కేసులు ఫైల్ చేయడం, సరైన పత్రాలు లేకుండా తరలించే నగదుని సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

స్టాటిక్ సర్వ్లెన్స్ బృందాలు చెక్ పోస్ట్ ల దగ్గర తనిఖీలు, యఫ్.ఐ.ఆర్.లు నమోదు చేస్తాయని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఎక్కడైనా నిబందనలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా చేసే ర్యాలీలు, అనుమతులు లేని హోర్డింగ్స్, బ్యానర్లు తొలగించండం, లౌడ్ స్పీకర్ల చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

సదరు బృందాలు ప్రచార అనుమతులు, ఎన్నికల నిబందనల గూర్చి వివరిస్తూ కరపత్రాల పంపిణీ, స్తానికంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్.ఓ.ల వారిగా వీడియో రికార్డింగ్ చేయిస్తున్నామన్నారు.

అన్ని రాజకీయ పార్టీల వారు తప్పనిసరిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (యంసిసి) పాటించాలని, మేయర్ అభ్యర్ధి ఎన్నికలలో 25 లక్షలు ఖర్చు చేయవచ్చని, కార్పొరేటర్ అభ్యర్ధి 10 లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు.

నామినేషన్ తో పాటు దరఖాస్తు చేసుకోవాల్సిన పత్రాల సమాచారంతో కూడిన చెక్ లిస్టు కాపీలను రాజాకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తున్నామన్నారు. నామినేషన్ వేయు అభ్యర్ధులకు నగర పాలక సంస్థ నుండి రావలసిన నో డ్యూ సెర్తిఫికెట్ల కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, త్వరితగని అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్నికల ప్రచారం చేయు వారు వారి సభలకు, ర్యాలీలు నిర్వహించుటకు మరియు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, ఈ అనుమతులు త్వరితగతిని ఇచ్చుటకు నగర పాలక సంస్థలో సింగల్ విండో విధానాన్ని అమలు చేయు ప్రత్యక కౌంటర్ ఉపా సెల్ నందు ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల ప్రచారానికి దేవాలయాలు, చర్చిలు, మసీదుల వంటి వాటిని వేదికగా వాడరాదన్నారు. జాతి, మతం, కులం ప్రాతిపదికగా ఓటు వేయమని అడుగకూడదని తెలిపారు.

సమావేశం నందు సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ. కిషోర్, జి. రవీంద్ర బాబు, డి.సిలు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సి.హెచ్ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి సతీష్, జాగర్లమూడి శ్రీనివాసరావు, బిజేపి చరక కుమార్ గౌడ్, వైస్సార్సీపీ మహేస్వర రెడ్డి, శ్రీనివాసరావు, కిషోర్, జనసేన త్రినాద్, ఆమాద్మి తాత సేవ కుమార్, బియస్పి వాసు, కాంగ్రెస్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN