Guntur: రాజధాని హంగులతో గుంటూరు రహదారులు.. రెండు దశల్లో పనులు!

Guntur: గుంటూరు నగరంలో రూపురేఖలు మార్చేలా 11 రోడ్డు కారిడార్లు, 7 ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Sept 2026 11:55 PM IST
Guntur
X

Guntur: రాజధాని హంగులతో గుంటూరు రహదారులు.. రెండు దశల్లో పనులు!

గుంటూరు: గుంటూరు నగరంలో అభివృద్ధి చేయనున్న రోడ్డు కారిడార్లు మరియు జంక్షన్లను పట్టణ ప్రణాళిక,ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు క్షేత్రస్తాయిలో పర్యటించి, అడ్డంకులు తొలగించి త్వరితగతిన పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్నందున నగరంలో అధునాతన హంగులతో ప్రధాన రహదారులు, జంక్షన్లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గుంటూరు నగరంలో 11 రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయనున్నామని, వాటిలో మొదటి ఫేజ్ క్రింద కాకాని రోడ్డు, విఐపి రోడ్డు, లక్ష్మిపురం రోడ్డు మరియు కలెక్టరేట్ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని, రెండవ ఫేజ్ క్రింద అమరావతి రోడ్డు, చిలికలూరిపేట రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నల్లచెరువు రోడ్డు, విద్యానగర్ రోడ్డు, పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డులను అభివృద్ధి చేయనున్నామని తెలియచేశారు.

సదరు రోడ్డు కారిడార్లలో ఏపియుఐఎయంయల్ వారు తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు. రోడ్డు కారిడార్లలో గ్రీనరి అభివృద్ధి, స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజ్ వ్యవస్థ, వాహనాల పార్కింగ్, ఫుట్ పాత్ లు, స్ట్రీట్ వెండింగ్ జోన్స్, దివైడర్స్ అభివృద్ధి వంటి పనులను ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేశారన్నారు.

పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ మరియు ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు క్షేత్ర స్తాయిలో పర్యటించి సమస్యలేమైనా ఉంటె గుర్తించి పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు సదరు ప్రాంతాలలో త్రాగు నీటి పైప్ లైన్ పనులు, మరమ్మతులు పనులు మరియు పైప్ లైన్ షిఫ్తింగ్ పనులు ఏమైనా ఉంటె వెంటనే పూర్తి చేయాలని పూర్తి చేయాలని,

అలాగే సదరు ప్రాంతాలలో ఆక్రమణలు ఏమైనా ఉంటె వాటిని వెంటనే తొలగించి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని 7 జంక్షన్లలో అభివృద్ధి పనులు నిర్వహించడానికి ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు ప్రతిపాదనలు సిద్దం చేశారని, సదరు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ సుందర్రామి రెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ విష్ణుమూర్తి, వేణుగోపాల్, ఏసిపిలు రెహమాన్, జేకీరా, డిఈఈలు, టిపిబిఓలు, ఏఈలు ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN