Guntur: ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు సమగ్ర శిక్షణ!
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు జీఎంసీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ నిర్వహించారు.
Guntur: ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు సమగ్ర శిక్షణ!
గుంటూరు: ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలు, ఏఆర్ఓ లు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్ఓ, ఏఆర్ఓలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల సరళి, నిర్వహణ, నిబందనలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు మాట్లాడుతూ, త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది అందరు సిద్దంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్.ఓ ల పాత్ర ఎంతో ముఖ్యమని, రిటర్నింగ్ అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నవార్డులో తప్పులు జరిగితే దానికి ఆర్.ఓ నే పూర్తి బాధ్యవహించాల్సి వస్తుందని.
కావున ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఆర్ఓ, ఏఆర్ఓ విధులు కేటాయించబడిన ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణ పై పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆర్ఓ, ఏఆర్ఓ విధులుగా విధులు కేటాయించబడిన వారు ముందుగా మీకు కేటాయించబడిన డివిజన్లలో ఓటర్ల నమోదు (ఎలేక్ట్రోరోల్), ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు మరియు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి.
అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించి, జిఎంసి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆర్ఓ, ఏఆర్ఓలు ఎలేక్ట్రోరోల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆర్ఓ హ్యాండ్ బుక్, ఎలక్షన్ గైడ్ లైన్స్, కాండిడేట్స్ హ్యాండ్ బుక్ వంటి వాటి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ముఖ్యంగా ఆర్ఓ లు ఏఆర్ఓలుగా విధులు కేటాయించబడిన వారు తప్పనిసరిగా ఎంసిసి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ను పాటించాలని తెలియచేశారు. ఆర్.ఓలు ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించటకు నగర పాలక సంస్థ అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి సహకరిస్తుందని తెలియచేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది, ఆర్ఓలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.




