Guntur: 59వ డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం

Guntur: గుంటూరు 59వ డివిజన్‌లో ఎన్డీఏ మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Oct 2026 12:16 PM IST
Guntur
X

Guntur: 59వ డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం

Guntur: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 59వ డివిజన్‌లోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు.

మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ..నవంబర్ 1న సైకిల్ గుర్తుకు ఓటు వేసి 76 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులకు కూడా ఓటు వేయాలని నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు సాగేందుకు తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర శిల్పకళా చైర్మన్ మంజుల రెడ్డి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర,( నాని ), తాడికొండ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఉమాదేవి, అబ్బూరి మల్లి, భాష్యం నరసయ్య, 59వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పేరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN