Mangalagiri: సీఎం చంద్రబాబును కలిసిన రాజోలు ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య!

Mangalagiri: సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య. రాజోలు అభివృద్ధి, 'ఇంటింటికీ తెలుగుదేశం'పై ప్రశంసలు.

PRABHU, RAZOLE
Updated on: 19 Sept 2026 9:13 AM IST
Mangalagiri
X

Mangalagiri: సీఎం చంద్రబాబును కలిసిన రాజోలు ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య!

Mangalagiri: మంగళగిరి లోని సచివాలయంలో ఏపి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల పనితీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసినట్లు అమూల్య తెలిపారు.

నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, స్థానికంగా పరిష్కరించాల్సిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. ఆయా అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తీరుపై చంద్రబాబు అభినందించినట్లు అమూల్య వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం సూచించినట్లు ఆమె తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE