Vinukonda: స్థానిక పోరుకు సిద్ధం కండి.. ఎమ్మెల్యే జీవీ
Vinukonda: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయమే లక్ష్యం! వినుకొండలో నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక దిశా నిర్దేశం.
Vinukonda: స్థానిక పోరుకు సిద్ధం కండి.. ఎమ్మెల్యే జీవీ
Vinukonda: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్,జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ,
ప్రతి లబ్ధిదారునికీ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి జెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన దిశా నిర్దేశం చేశారు.




