Guntur: రైతన్నకు శుభవార్త.. ఛానల్ ఆధునికీకరణకు రూ. 369 కోట్లు మంజూరు!
Guntur: గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వం రూ. 369.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు.
Guntur: రైతన్నకు శుభవార్త.. ఛానల్ ఆధునికీకరణకు రూ. 369 కోట్లు మంజూరు!
గుంటూరు: గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ.369. 20 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెమ్మసాని కామెంట్స్
* రైతే రాష్ట్రానికి వెన్నెముక అని నిరూపిస్తూ కూటమి ప్రభుత్వం మన గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ. 369.20 కోట్లను మంజూరు చేయడం ఎంతో ఆనందించదగ్గ అంశం.
* ఈ ఆధునికీకరణ ద్వారా కెనాల్ కు స్లోప్ బండ్స్ ఏర్పాటు చేయబడతాయి.
* ఉన్న చానల్ను విస్తరింపజేసి సాగు, తాగు నీరును అందజేయడమే ఈ ఆధునికీకరణ ప్రధాన ఉద్దేశం.
* స్థానిక రైతాంగ సమస్యను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, విస్తరణకు సహకరించారు.
* ఇక్కడి సమస్యలను ఆధారంగా నేను, ధూళిపాళ్ల నరేంద్ర, రామాంజనేయులు కలిసి అంచనాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది.
* గుంటూరు ఛానల్ విస్తరించడం వల్ల ప్రస్తుతం 27 వేల ఎకరాలు ఉన్న ఆయకట్టు మరో 48 ఎకరాల చేరి మొత్తం 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
* దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కెనాల్ విస్తరణకు ఆధునిక కీర్తనకు సంబంధించి 280 స్ట్రక్చర్లను రీ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము.
* విస్తరణ వివరించడం వల్ల నాలుగు టీఎంసీల నీళ్లను ఉపయోగించుకునే విధంగా జనాలను రూపొందించబోతున్నాము.
* ఇలా అధికంగా నీరు పంట భూములు అందడం వల్ల పంట ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి.
* మొదట్లో మేము పరిశీలించిన తర్వాత కెనాల్ లో కాంక్రీట్ బెడ్ వేయాల్నా అంచనాలు ఉన్నాయి. కానీ చాలాచోట్ల ఆ కాంక్రీట్ బెడ్ వలన కొన్ని సమస్యలు తలుతున్నాయని స్పష్టమవుతుంది.
* అందుకు ప్రత్యామ్నాయంగా కెనాల్ స్లోప్ బండ్ లు ఏర్పాటు చేస్తున్నాము.
* నాలుగు టిఎంసిలు రావలసిన కెనాల్ నుంచి ప్రస్తుతం 600 క్యూసెక్కులు కూడా తీసుకోలేని పరిస్థితి.
* స్లోప్ లేకపోవడం, ఉన్న నీరు ఇంకిపోవడం, గుర్రపు డెక్క పెరిగిపోవడం వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి.
* ఇలా రకరకాల సమస్యలపై అవగాహన లేని గత ycp నాయకుల పాలన వల్ల రైతులకు అందాల్సిన స్థాయిలో నీరు అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.
* దానికి నీళ్లు కావాలంటే రైతుల తరఫున నిలబడే కూటమి ప్రభుత్వం మరో 27 కిలోమీటర్లు అదనంగా విస్తరిస్తూ, రైతులకు నాలుగు టిఎంసిల నీటిని రెండు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
* రైతుల భూములు ధరలు పెరుగుతాయి. రైతులు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు.
* సంక్షేమ ఫలాలు ఇస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు ఇస్తూ.. ఇన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాల్ని విస్మరించకుండా ఈరోజు ల్యాండ్ ఎక్స్టెన్షన్ కు దాదాపు రూ.70 కోట్లు ఈరోజు మళ్లీ రూ. 370 కోట్లు ఛానల్ కి అంటే 450 కోట్లు ఒక పార్లమెంటు సెగ్మెంట్ లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
* మనస్పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గాని, ధూళిపాళ్ల నరేంద్ర గాని, లోకేష్ గాని, నేను ఎక్కడున్నా కూడా వీళ్లు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు తో, చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ తోటి అదేవిధంగా చంద్రబాబు నాయుడు తోటి ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు సాయంత్రం చేయించిన ఎమ్మెల్యేలకు అందరికీ మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూన్నాను.
ఎమ్మెల్యే రామాంజనేయులు కామెంట్స్
* రైతులను గుర్తించి ఆలోచించి, రైతులకు ఆసరాగా అన్నదాత సుఖీభవ అందిస్తున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబునాయుడు .
* టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు సహకరిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మన గుంటూరు జిల్లాకు రూ. 369.20 కోట్లను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం.
* 1972లో ప్రారంభమైన ఈ కెనాల్ కొన్ని కారణాలవల్ల చిట్టచివరి ప్రాంతాల వరకు నీరు అందించలేక పోయింది.
* ఆ సమస్యను, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టిడిపి గత హయాంలోని ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించాలని టెండర్లు పిలిచారు.
* కానీ 2019 తర్వాత ఆ టెండర్ లను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం కెనాల్ పనులను అటకెక్కించింది.
* అందుకు సహకరిస్తూ కేంద్ర సహాయ మంత్రి పెమ్సాని చంద్రశేఖర్ చూపిన చొరవ కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీ సర్వే ద్వారా వచ్చిన ఇన్సెంటివ్ లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా అందులో కొంత భాగాన్ని గుంటూరు ఛానల్ కు కేటాయింపు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు.
* దాదాపు 41 గ్రామాలకు మంచినీరు, పల్నాడు నుంచి మరో 9 గ్రామాలు కలిపి 50 గ్రామాలకు తాగునీరు కూడా అందుతున్న ఈ గుంటూరు ఛానల్ ను విస్తరణ కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.౮
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య , నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు , మండల పార్టీ ప్రెసిడెంట్ మర్రి సాంబయ్య , AMC వైస్ చైర్మన్ నార్నే బాబు , MPTC ఉప్పుటూరి సుధ , సర్పంచ్ నార్నె రాజ్యలక్ష్మి తదితర నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




