Vetapalem: వేటపాలెం సర్వోదయ కాలనీ స్కూల్‌లో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

Vetapalem: వేటపాలెం సర్వోదయ కాలనీ గిరిజన ప్రాంత పాఠశాలలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ. విద్యావేత్త డాక్టర్ గుణ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 1 July 2026 7:21 PM IST
Vetapalem
X

Vetapalem: వేటపాలెం సర్వోదయ కాలనీ స్కూల్‌లో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

వేటపాలెం: వేటపాలెం గ్రామంలో గల గిరిజన ప్రాంతం అయిన సర్వోదయ కాలనీ, మండల ప్రాథమిక పాఠశాల నందు గల విద్యార్థులకు వ్రాత పుస్తకములు పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది.

ముఖ్య అతిదిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గుణ శంకర్ గారు పాల్గొని మాట్లాడుతూ ప్రాథమిక విద్య కు ప్రోత్సాహం ఇస్తున్న పట్టభద్రుల సంఘాన్ని కొనియాడుతూ సర్వోదయ కాలనీ అనేది గిరిజన ప్రాంతం మరియు బలహీన వర్గాలు.

అక్షరాస్యత తక్కువగా ఉన్న తల్లిదండ్రులు గల ప్రాంతమై ఉండటము, ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ప్రత్యేకముగా పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషం అని అన్నారు.

సంఘ అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ వేటపాలెం మండలంలో ప్రధానంగా గిరిజనులు, బలహీనవర్గాలు ఉన్న ప్రాంతాలను తీసుకొని ఆ ప్రాంతాల్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు విద్యపై శ్రద్ధ కలగడానికి వ్రాత పుస్తకములు పంపిణీ చేయడం అనేది సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం.

వేటపాలెం మండలంలో డ్రాపౌట్స్ ఉండకూడదు, ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేది ప్రధాన ఉద్దేశం. కార్యక్రమంలో సంఘ సభ్యులు గుడిమూటి శేఖర్ బాబు, కాకరపర్తి చంద్రమోహన్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ పార్వతి,జయశ్రీ ,గిరిజ వాణి, తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story