Guntur: పొన్నూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ.. 2 వేల మందికి అన్నదానం!

Guntur: గుంటూరు జిల్లా పొన్నూరు డఫ్ పేటలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, 2,000 మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

SHAREEF, PONNURU
Published on: 26 Aug 2026 7:38 PM IST
Guntur
X

Guntur: పొన్నూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ.. 2 వేల మందికి అన్నదానం!

గుంటూరు: పొన్నూరు పట్టణంలో మీలా దున్ నబి పండగని పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా బుధవారం పొన్నూరు పట్టణం ఐదో వార్డు డఫ్ పేట ముస్లిం యూత్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది.

ఈ ర్యాలీలో ముస్లిం మతపెద్దలు యువకులు అందరూ పాల్గొని మహమ్మద్ ప్రవక్త వారు అనుసరించిన జీవన విధానం ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన చెప్పిన సందేశాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని ఇస్లాం అనేది కేవలం మాటలకే కాదు శాంతికి అత్యున్నత మార్గాన్ని చూపించేదని అన్నారు. ఈ సందర్భంగా 2000 మందికి డఫ్ పేట మార్కెట్ జండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అంజుమన్ ప్రెసిడెంట్ మగ్బుల్ బెగ్, జానీ బెగ్, టెంట్ హౌస్ మునీర్ , షేక్ జానీ, షేక్ జిలాని, జాన్ షైదా తదితరులు మత పెద్దలు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU