Narasaraopet: నరసరావుపేటలో సామూహిక ఖత్నా కార్యక్రమం.. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు
Narasaraopet: నరసరావుపేటలో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో 100 మంది చిన్నారులకు ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమం నిర్వహించారు.
Narasaraopet: నరసరావుపేటలో సామూహిక ఖత్నా కార్యక్రమం.. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు
నరసరావుపేట: నరసరావుపేట పట్టణంలోని షాదీ ఖానాలో 100 మంది చిన్నారులకు వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఖత్నా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & నరసరావుపేట ఇంచార్జి శ్రీ సయ్యద్ జిలాని పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా , నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.
ముస్లిం సంప్రదాయం ప్రకారం దాదాపు 100 మంది చిన్నారులకు ఉచితంగా ఖత్నా నిర్వహణ. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ హామీ. విద్య, ఉపాధి రంగాల్లో ముస్లిం యువత సాధిస్తున్న విజయాలపై ప్రశంసలు. ఆటో నగర్ మరియు ఉర్దూ లైబ్రరీ ఆధునీకరణ మరియు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుకు సానుకూల స్పందన. కరోనా కష్టకాలంలో ముస్లిం యువత చేసిన సామాజిక సేవలను గుర్తుచేసుకున్న అతిథులు. కులమతాలకు అతీతంగా, ఐక్యతతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం నరసరావుపేట నియోజకవర్గానికె గర్వకారణం.




