Gurazala: గురజాల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!

Gurazala: ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలతో చిన్నారి విద్యార్థులు అందరినీ అలరించారు.

SK SAIDA, GURAJALA
Published on: 4 Sept 2026 1:48 PM IST
Gurazala
X

Gurazala: గురజాల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!

Gurazala: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.పాఠశాల అలంకరణ,పండుగ వాతావరణం ఉట్టిపడేలా పాఠశాల ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు.

రంగురంగుల ముగ్గులు, పూల మాలలు, మామిడాకులు మరియు బెలూన్లతో క్లాస్ రూములను, స్టేజీని అలంకరించారు. కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి పూజకు సిద్ధం చేశారు.చిన్నారుల ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ చిన్నారుల వేషధారణ. ప్రాథమిక తరగతుల పిల్లలు శ్రీకృష్ణుడు మరియు రాధ, గోపికల వేషధారణల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు.

నెమలి ఈకలు కలిగిన కిరీటాలు, చేతిలో వేణువులు ధరించిన బుజ్జి కృష్ణులు పాఠశాల అంతటా తిరిగి సందడి చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పాపారావు , ఉపాధ్యాయులు , శివన్నారాయణ, కాసిం, వీరారెడ్డి, ఉపాధ్యాయుని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA