Guntur: అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణ కేంద్రాల ఏర్పాటు స్వాగతార్హం

Guntur: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల సేకరణకు రాష్ట్రంలో 16 కేంద్రాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు అగ్రిగోల్డ్ అసోసియేషన్ నేత ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 11:44 PM IST
Guntur
X

Guntur: అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణ కేంద్రాల ఏర్పాటు స్వాగతార్హం

గుంటూరు: ముఖ్యమంత్రి, మంత్రి వర్గ ఉప సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ డిపాజిట్టారుల బాండ్ల సేకరణ, ఫిక్సిడ్ డిపాజిట్స్, కొనుగోలు చేసిన స్థలాలు తదితర వివరాల సేకరణకు గాను ఉమ్మడి 13 జిల్లాలోనూ, విజయవాడ, కాకినాడ, తిరుపతి కలిపి మొత్తం 16 కేంద్రాలు ప్రారంభించాలని సీఐడీ విభాగం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 8 నుంచి కాక 9, 10 తేదీలలో ఆయా జిల్లాల్లో బాండ్ల సేకరణ ప్రారంభం కావచ్చని ఆయన తెలిపారు. దసరా ఉత్సవాల కారణంగా కర్ణాటక రాష్ట్రంలో 20వ తేది తరువాత బాండ్ల సేకరణ ప్రారంభం కానున్నదని ఆయన తెలిపారు. మన సీఐడీ చొరవతో తెలంగాణ, ఒరిస్సా, అండమాన్, తమిళనాడు, చత్తీస్ఘడ్, మహరాష్ట్రలో కూడా ఆయా రాష్ట్రాల సీఐడీ విభాగాలతో చర్చించి బాండ్ల సేకరణ కేంద్రాలు ప్రారంభించనున్నారని వెల్లడించారు.

ఆయా ప్రభుత్వాలు కూడా తగిన శ్రద్ధ వహించి త్వరితగతిన మిగిలిన ఏడు రాష్ట్రాలలో బాండ్ల సేకరణ ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, సీఐడీ వారికి లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఆయా జిల్లాలలో బాండ్ల సంఖ్యను బట్టి మండలాల వారీగా తేదీలను నిర్ణయించడం ఉత్తమమని హోంమంత్రి, సివిల్ సప్లయీన్ శాఖ మంత్రికి ముప్పాళ్ళ సూచించారు.

లేనిపక్షంలో బాండ్ల సేకరణ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపాజిట్టాదారులు ఒకేసారి అధిక సంఖ్యలో తరలివస్తే ఆయా కేంద్రాలపై ఒత్తిడి పెరిగి అసౌకర్యం కలిగే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా ప్రభుత్వం తలపెట్టిన మంచి పనికి ఇబ్బంది కలుగవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం - 88,416, చిత్తూరు-67,951, తూర్పుగోదావరి- 88,804, -2,15,462, -2,32,943, -74,270, 3-1,10,494, (5-1,84,064, -2,15,940, 2-2,88,031, 2-1,48,054, 8-1,16,884, ໒໕໖-1,11,808 మేరకు బాండ్లు ఉన్నట్లు ముప్పాళ్ళ తెలిపారు.

ఆయా జిల్లాల్లో మండలాల వారీగా తేదీలు ప్రకటించి గందరగోళానికి గురికాకుండా డిపాజిట్టాదారుల బాండ్లు సేకరించేటట్లు హోంమంత్రి, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఆదేశించాలని కోరారు. అదేవిధంగా డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అధారిటీ(డీఎల్ఎస్ఏ) వద్ద గతంలో సేకరించిన సుమారు 30 వేల బాండ్లు ఉన్నవని, వాటన్నింటిని బాధితులకు సత్వరం ఇప్పించాలని హోంమంత్రిని కోరారు. ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా సమీప బాండ్ల సేకరణ కేంద్రాలకు తమ బాండ్లు ఇచ్చుకునే అవకాశం డిపాజిట్టారులకు కల్పించమని మంత్రులకు ముప్పాళ్ళ విజ్ఞప్తి చేశారు. ఆయా జిల్లాల అసోసియేషన్ బాధ్యులు బాండ్ల సేకరణకు సీఐడీ వారికి సహకరించాలని ముప్పాళ్ళ విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN