Guntur: రాజధాని భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్!

Guntur: రాజధాని భూముల సేకరణ, రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని గుంటూరు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 12 Nov 2026 5:58 PM IST
Guntur
X

Guntur: రాజధాని భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్!

గుంటూరు: రాజధాని భూముల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, సి.ఆర్.డి.ఎ అడిషనల్ కమీషనర్లు భార్గవ్ తేజ, కార్తీక్ లతో కలసి రాజధాని భూసేకరణ గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ఈ - 3, ఈ - 13, ఈ -15 నుండి ట్రంక్ రోడ్ ను విస్తరించి ఎన్ హెచ్ 16 ను కలిపేందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అంశాల గురించి చర్చించారు. అదేవిధంగా రెండవ విడత ల్యాండ్ పూలింగ్ కింద భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసిల్దార్లు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ ఖాజావలి, గుంటూరు , తెనాలి ఆర్డీవో లు శ్రీనివాసరావు, రమణి, ఎస్డీసీలు తహసీల్దార్లు , సిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN