Guntur: ఆటోనగర్‌లో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే నసీర్ పర్యటన

Guntur: గుంటూరు ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Updated on: 10 Oct 2026 4:44 PM IST
Guntur
X

Guntur: ఆటోనగర్‌లో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే నసీర్ పర్యటన

Guntur: గుంటూరు ఆటోనగర్ లో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ , గుంటూరు (తూర్పు) శాసన సభ్యులు నసీర్ అహ్మద్ శనివారం పర్యటించారు. ఆటోనగర్లో వసతులు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి దశలవారీగా చర్యలు చేపడతామని చెప్పారు. రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని అన్నారు. ఆటోనగర్లో పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణం వంటి అవసరాలను గుర్తించామని తెలిపారు. అచ్యుత ఉన్న తుక్కు (స్క్రాప్) మరో ప్రాంతానికి ప్రదేశానికి తరలించుటకు అవకాశాలు పరిశీలిస్తున్నామని అన్నారు.

అదేవిధంగా అవసరం లేని పరికరాలను రోజువారి తరలించుటకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో గుర్తిస్తామని చెప్పారు. గుంటూరు నగరంలో చక్కటి ఆటోనగర్ ఏర్పాటు జరుగుటకు, అందరి అవసరాలు తీర్చే విధంగా ఉండాలని భావిస్తున్నామని అన్నారు. మంచి ఆటోనగర్ ఏర్పాటు వలన ఉపాధి అవకాశాలు కూడా పెంపొందగలరని ఆశ భావం వ్యక్తం చేశారు.

శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చక్కటి రహదారులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, గుంటూరు నగరపాలక సంస్థ కార్యనిర్వహక ఇంజనీర్ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN