Guntur: కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు

Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు రాష్ట్ర బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు. కేశన శంకర్ రావు ఆధ్వర్యంలో కోవెలమూడి దంపతుల సత్కారం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Oct 2026 11:31 PM IST
Guntur
X

Guntur: కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు

గుంటూరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు, గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థిని కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని సంఘాల అధ్యక్షుడు కేశన శంకర్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అదే స్ఫూర్తితో గుంటూరు నగర అభివృద్ధికి లక్ష్మీ అపర్ణ కృషి చేయాలని ఆకాంక్షించారు.

బుధవారం కోవెలమూడి నాని, లక్ష్మీ అపర్ణ దంపతులను కేశన శంకర్ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం కోవెలమూడి కుటుంబం అందించిన సేవలు అసాధారణమని కొనియాడారు. పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచిన ఆ కుటుంబం పట్ల తమకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు.

కూటమి అభివృద్ధి కార్యక్రమాలకు బీసీ సంఘాల అండ

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బీసీ సంఘాల మద్దతు ఉంటుందని కేశన శంకర్ రావు తెలిపారు. గుంటూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగేందుకు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేందుకు కూటమి అభ్యర్థిని కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు తమ సంఘాల తరఫున సహకారం అందిస్తామని చెప్పారు.

మేయర్ ఎన్నికల్లో లక్ష్మీ అపర్ణకు మద్దతుగా నిలిచి, ఆమె విజయానికి తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు. నగర ప్రజలు అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు తమ మద్దతు తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం, కోవెలమూడి కుటుంబం చేస్తున్న కృషికి ప్రజల సహకారం తోడైతే గుంటూరు అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నా మాష్టారుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN