Guntur: గుంటూరు 49వ డివిజన్‌లో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు!

Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిలో విభేదాలు. 49వ డివిజన్‌లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎవరికి వారుగా ఓట్లు వేయించుకోవడంపై ఆసక్తికర చర్చ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 3:08 PM IST
Guntur
X

Guntur: గుంటూరు 49వ డివిజన్‌లో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు!

Guntur: గుంటూరు కూటమి ధర్మం, 100% స్టైక్ రేటుకు తినోదకాలు. కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు 49వ డివిజన్లో పోటీకి దిగాయి. వైఎస్ఆర్సిపి నుండి జ్యోతి, తెలుగుదేశం పార్టీ సుగుణ దేవి, జనసేన పార్టీ విద్యావతి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన ప్రధాన నాయకులు స్నేహపూర్వక పోటీ అన్నారు.

ఈరోజు జరిగిన ఎన్నికల్లో రవీంద్ర నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఎవరి అభ్యర్థులు వాళ్లకే వాళ్ల సింబల్ కే ఓట్లు వేయించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ విషయం కాస్త టీడీపీ, జనసేన వర్గీయులకు మింగుడు పడలేదు. తమన ఓడించాలని మరో పార్టీ ప్రయత్నం చేస్తుందని ఒకరినొకరు ఆరోపించుకున్నారు. కూటమి ధర్మం ఇదేనా అని జనసేన అభ్యర్థులు వాపోయారు.

49వ డివిజన్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన మూడు పార్టీలు తలపడ్డాయి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN